జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి నెల రోజులు గడిచినప్పటికీ ఆ రాష్ట్రంలో జనజీవనం ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా శుక్రవారం విధించిన ఆంక్షలను సడలించినా.. ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.
కశ్మీర్‌లోని సున్నిత ప్రాంతాల్లో ప్రతి శుక్రవారం ఆంక్షలను విధిస్తున్నారు అధికారులు. మసీదులు, ఆలయాల్లో సమావేశమయ్యే వారిలో కొంత మంది స్వార్థ ప్రయోజనాలతో అలజడులు సృష్టించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి... జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.