లాక్డౌన్ల సమయంలో స్వస్థలాలకు చేరుకున్న వేలాది మంది వలస కార్మికుల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ స్మృతి సంస్థాన్ (పీడీయూఎస్ఎస్). వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, శ్రమ దోపిడీ దృష్ట్యా జాతీయ కమిషన్ అత్యవసరమని పీడీయూఎస్ఎస్ పేర్కొంది.
"జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ), జాతీయ మైనారిటీల కమిషన్ తరపున వలస కార్మికుల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రానికి, మోదీకి విజ్ఞప్తి చేశాం."