మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు కొత్త చిక్కులు మొదలయ్యాయి. పాత కేసులకు సంబంధించి నాగ్‌పుర్ కోర్టు ఆదేశాలతో పోలీసులు సమన్లు జారీ చేశారు. మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజే ఈ సమన్లు జారీ కావటం గమనార్హం.
2014 ఎన్నికల నాటి అఫిడవిట్లో తనపై పెండింగ్‌లో ఉన్న రెండు క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించలేదని ఆయనపై న్యాయవాది సతీశ్ వ్యాజ్యం దాఖలుచేశారు. ఈ విషయంలో ముంబై హైకోర్టులో ఫడణవీస్‌కు ఊరట లభించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు సతీశ్.
సుప్రీం కోర్టు ఆదేశాలతో...
ముంబయి హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ వ్యాజ్యాన్ని పునఃపరిశీలనకు తీసుకోవాలని విచారణ కోర్టును 2019 అక్టోబర్ 1న ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలో తాజాగా సమన్లు జారీ చేసింది నాగ్‌పుర్ కోర్టు.