కరోనా కారణంగా ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. చాలా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్ ఆస్పత్రులుగా రూపుదాల్చాయి. దాదాపు అన్ని ఆస్పత్రులు ఓపీ సేవలు నిలిపివేశాయి. ఫలితంగా సాధారణ రోగులు ఆస్పత్రులకు రావడం తగ్గిపోయింది. చూసేవారికి మాత్రం వీరి సంఖ్య తగ్గిపోయిందని అనుకోవడం సహజం. కానీ, ఇలాంటి సమయంలో ఉన్న రోగాలకు కొత్త రోగాలు ఎందుకు తెచ్చుకోవడం అని ఆస్పత్రుల మొహం కూడా చూడడం లేదనేది కాదనలేని సత్యం. ఈ పరిస్థితిని ఊహించిన గుజరాత్‌లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏంఎసీ) సరికొత్త ప్రయోగానికి తెరతీసింది. ధన్వంతరి రథ్ పేరిట ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది.
వారి కోసం ప్రత్యేకంగా...
డయాబెటిస్, బీపీ, గుండె సంబంధిత జబ్బులతో బాధపడేవారితో పాటు ఇతర సమస్యలతో ఆస్పత్రికి రాలేని వారి కోసం అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ మొబైల్ మెడికల్ వ్యాన్లు ఏర్పాటు చేసింది. ఇందులో ఆయుష్ డాక్టర్, ఓ పారామెడిక్, నర్సింగ్ సిబ్బంది, స్థానిక వైద్యాధికారి ఉంటారు. అహ్మదాబాద్ నగరంలో కరోనా యేతర సేవలు అందించేందుకు ప్రత్యేకించారు. ఆయుర్వేదిక్, హోమియోపతి, విటమిన్ టాబ్లెట్లు, సాధారణ పరీక్షల యంత్రాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ వాహనాల్లో పరీక్షించిన అనంతరం ఎవరికైనా ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటే తగిన సూచనలు కూడా చేస్తారు.
4 లక్షల మందికి ఓపీ సేవలు...