తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తుది ఎన్​ఆర్​సీపై విశ్వాసం లేదు: అసోం భాజపా - అసోం

జాతీయ పౌర జాబితాపై తమకు విశ్వాసం లేదని ప్రకటించారు భాజపా అసోం విభాగం అధ్యక్షుడు రంజిత్​కుమార్​ దాస్. దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

తుది ఎన్​ఆర్​సీపై విశ్వాసం లేదు: అసోం భాజపా

By

Published : Aug 31, 2019, 9:12 PM IST

Updated : Sep 29, 2019, 12:22 AM IST

నేడు విడుదలైన జాతీయ పౌర జాబితా(ఎన్​ఆర్​సీ)పై విశ్వాసం లేదని ప్రకటించారు భాజపా అసోం విభాగం అధ్యక్షుడు రంజిత్​కుమార్ దాస్. దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఇంతకుముందు విడుదలైన జాబితాతో పోల్చితే చాలా తక్కువ మందిని జాబితా నుంచి తీసేశారని పేర్కొన్నారు.

"మేం ఈ ఎన్​ఆర్​సీని విశ్వసించలేం. ఈ తుది జాబితాతో సంతోషంగా లేము. దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీని చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం."

-రంజిత్​కుమార్ దాస్, అసోం భాజపా అధ్యక్షుడు

'విదేశీయుల ట్రైబ్యునళ్లలో అప్పీలుకు అవకాశం'

ఎన్​ఆర్​సీ తుది జాబితాలో చాలామంది భారతీయుల పేర్లు గల్లంతయ్యాయని పేర్కొంది అసోం ప్రభుత్వం. కానీ భారతీయులు భయపడాల్సిన పని లేదని వారు విదేశీయుల ట్రైబ్యునళ్లలో అప్పీలు చేసుకోవచ్చని ప్రకటించింది. జాబితాలో పేర్లు లేని వారికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సహాయం అందిస్తుందని వెల్లడించింది.

ఇదీ చూడండి: అసోంకు ఎమ్మెల్యేలే... కానీ భారతీయులు కారు.!

Last Updated : Sep 29, 2019, 12:22 AM IST

ABOUT THE AUTHOR

...view details