తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"మాటల్లేవ్​..మసూద్​ను పంపండి​"

పాకిస్థాన్​ భూభాగంలో ఉన్న తీవ్రవాద సంస్థలపై చర్యలు చేపట్టేంత వరకు దాయాది​తో ఎలాంటి చర్చలు ఉండబోవని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​ తేల్చిచెప్పారు.

తీవ్రవాద సంస్థలపై చర్యలు తీసుకునే వరకు పాక్​తో ఎలాంటి చర్చలు చేపట్టేది లేదని సుష్మా స్వరాజ్​ స్పష్టం చేశారు

By

Published : Mar 14, 2019, 3:00 PM IST

Updated : Mar 14, 2019, 3:31 PM IST

పాకిస్థాన్​ భూభాగంలో ఉన్న తీవ్రవాద సంస్థలపై చర్యలు తీసుకునే వరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు చేపట్టేది లేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరుకు పాక్​తో కలిసిపనిచేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

భారత్​-పాక్​ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నాశనం చేస్తోన్న ఐఎస్​ఐ, ఉగ్రసంస్థలను అదుపు చేయాల్సిన అవసరం ఉందని సుష్మా పేర్కొన్నారు.

తీవ్రవాద సంస్థలపై చర్యలు తీసుకునే వరకు పాక్​తో ఎలాంటి చర్చలు చేపట్టేది లేదని సుష్మా స్వరాజ్​ స్పష్టం చేశారు

" తీవ్రవాదంపై మేము మాట్లాడాలనుకోవట్లేదు, దానిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. తీవ్రవాదం, చర్చలు కలసి నడవలేవు. ఉగ్రవాదం, హింసను నిర్మూలించడానికి ఇప్పటికీ పాకిస్థాన్​తో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. మీ వద్ద ఉన్న ఉగ్రవాదులపై చర్యలు చేపట్టాలి. భారత్​లో తీవ్రవాద చర్యలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకునేంత వరకు ఎలాంటి చర్చలు జరగవు. ఇమ్రాన్​ఖాన్​కు ఉదార స్వభావం ఎక్కువగా ఉందని చెప్పారు. శాంతిని కోరుకుంటున్నామన్నారు. అంత ఉదారత కలిగిన వారైతే మసూద్​ అజార్​ను భారత్​కు అప్పగించాలి. ఆయనకు ఎంత ఉదారత ఉందో చూద్దాం"- సుష్మా స్వరాజ్​, భారత విదేశాంగ మంత్రి.

జైషే మహ్మద్​ నాయకుడు మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న గడువు ముగింపునకు కొద్ది గంటల ముందు ఈ వ్యాఖ్యలు చేశారు సుష్మా. అజార్​ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలని గత పదేళ్లలో భారత్​ నాలుగుసార్లు ప్రతిపాదించింది. కాని మరోమారు చైనా తన కపట బుద్ధిని చూపించి భారత ప్రతిపాదనకు మోకాలడ్డింది.

Last Updated : Mar 14, 2019, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details