తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఔషధాలు, వైద్య పరికరాల కొరత లేదు: కేంద్రం - Azithromycin

కరోనా వైరస్​ పోరాటానికి కావాల్సిన ఔషధాలు, వైద్య పరికరాలు భారత్​ వద్ద ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటి తయారీ, పంపిణీపైనా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు తెలిపింది.

No shortage of medicines, medical supplies across the country: Govt
దేశంలో ఔషధాలు, వైద్య పరికరాల కొరత లేదు: కేంద్రం

By

Published : Apr 3, 2020, 8:30 PM IST

దేశంలో ఔషధాల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనాపై పోరాటానికి కావాల్సిన వైద్య పరికరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

"వైద్య పరికరాలు, ఔషధాల... తయారీ, పంపిణీపై ప్రభుత్వం పూర్తి శ్రద్ధ చూపుతోంది."

- డి.వి.సదానంద గౌడ, కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి

కొరత లేదు... భయం లేదు..

గత ఐదు రోజుల్లో 62 లైఫ్​లైన్ ఉడాన్ విమానాలు 15.4 టన్నులకు పైగా అవసరమైన వైద్య సామగ్రిని రవాణా చేశాయని సదానంద గౌడ తెలిపారు. వైద్య పరికరాలు, ఔషధాల తయారీ కోసం సెజ్​లోని 200 యూనిట్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఈ వైద్య సామగ్రి పంపిణీని నిశితంగా పర్యవేక్షించడానికి, లాజిస్టిక్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం ఓ కంట్రోల్​ రూమ్​ను ఏర్పాటు చేసిందని చెప్పారు సదానంద.

ఉత్పత్తి చేయాల్సిందే..

నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్​పీపీఏ)... అవసరమైన ఔషధాలను తగినంతగా ఉత్పత్తి చేసి, వాటిని అందుబాటులో ఉంచాలని తయారీదారులను ఆదేశించింది. ఎన్​పీపీఏ ఇంతకు ముందు ... ఎఫ్​డీసీ లోపినావిర్​, రిటోనావిర్​ (200 ఎమ్​జీ+50 మి.గ్రా), హైడ్రాక్సీ క్లోరోక్విన్ (200 మి.గ్రా& 400 మి.గ్రా) అజిత్రోమైసిన్ (200 మి.గ్రా & 500 మి.గ్రా), పారాసెటమాల్​ (500 మి.గ్రా) తయారీదారులు తమ వద్ద ఈ ఔషధాల నిల్వలు ఎన్ని ఉన్నాయో తెలపాలని ఆదేశించింది కూడా.

"దేశంలో తగినంత స్థాయిలో హైడ్రాక్సీ క్లోరోక్విన్​, అజిత్రోమైసిన్ ఔషధ నిల్వలు ఉన్నాయి. అవసరమైతే, కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి." - సుదర్శన్​ జైన్​, ఫార్మాసూటికల్ అలయన్స్ సెక్రటరీ జనరల్​

ఇదీ చూడండి:'ఆ 2 ఘటనలు కరోనాపై పోరులో ఎదురుదెబ్బలు'

ABOUT THE AUTHOR

...view details