తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అంతిమ యాత్ర'కు నీటిలో సాహసం చేయాల్సిందేనా? - 'అంతిమ యాత్ర'కు నీటిలో సాహసం చేయాల్సిందేనా?

తమిళనాడులోని ఓ గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లేందుకు రోడ్డు మార్గం లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోవట్లేదని వాపోతున్నారు గ్రామస్థులు.

no road to cemetery last rites by walking across a waist-deep stream i tamilnadu thootukudi
'అంతిమ యాత్ర'కు నీటిలో సాహసం చేయాల్సిందేనా?

By

Published : Dec 24, 2019, 12:07 PM IST

అభివృద్ధిలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే దిశలో నడుస్తోంది భారత్​. అయితే.. రోడ్డు మార్గం లేక ప్రజలు సతమతమవుతున్న గ్రామాలు మాత్రం రోజూ ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడు తుత్తుకుడి, కోవిల్​పట్టు తాలూకా కట్టలాంకులం గ్రామంలో ఈ పరిస్థితే నెలకొంది. ఇక్కడ ఎవరైనా మరణిస్తే మోకాళ్ల లోతు నీటిలో అంతిమ యాత్ర నిర్వహించాల్సిన దుస్థితి.

గ్రామం నుంచి కిలోమీటరున్నర దూరంలో ఉన్న శ్మశానవాటికకు రోడ్డు మార్గం లేదు. చెట్లు, పొలాలు దాటి అక్కడికి చేరుకోవాలి. ఇటీవల దేశాన్ని కుదిపేసిన ఈశాన్య రుతుపవనాలు పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయి. భారీ వర్షాలకు ఆ మార్గమంతా నీటితో నిండిపోయి చెరువును తలపిస్తోంది. కాలు తీసి కాలు వేస్తే జారిపడే ప్రమాదకర దుస్థితి. ఈ పరిస్థితుల్లో శవయాత్ర నిర్వహించడం బంధువులకు ఓ సవాలుగా మారింది.

'అంతిమ యాత్ర'కు నీటిలో సాహసం చేయాల్సిందేనా?

శ్మశానవాటికకు రోడ్డు మార్గం నిర్మించాలనీ, కాయతార్​ పంచాయతీలో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా.. ఫలితం లేదంటున్నారు స్థానికులు. గ్రామంలో 400 నుంచి 500 ఇళ్లున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు.

ఇదీ చదవండి: ప్రస్థానం: నాడు ఎమ్మెల్యేగా ఓటమి.. నేడు రెండోసారి సీఎం!

ABOUT THE AUTHOR

...view details