తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అధికరణ 370 రద్దుకు యావత్ ప్రపంచం మద్దతు'

అధికరణ 370 వల్ల కశ్మీర్​ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఉద్ఘాటించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. 370 రద్దు నిర్ణయానికి ప్రపంచం మొత్తం మద్దతు పలికిందని తెలిపారు. కశ్మీర్​ లోయలో ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. కానీ కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'అధికరణ 370 రద్దుకు యావత్ ప్రపంచం మద్దతు'

By

Published : Sep 29, 2019, 3:25 PM IST

Updated : Oct 2, 2019, 11:20 AM IST

'అధికరణ 370 రద్దుకు యావత్ ప్రపంచం మద్దతు'

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు నిర్ణయానికి ప్రపంచం మొత్తం మద్దతు పలికిందని పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. రానున్న 5-7 సంవత్సరాల్లో కశ్మీర్​ అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందన్నారు.

దిల్లీలోని ఇంద్రప్రస్తా విశ్వ సంవాద్​ కేంద్రంలో 'జాతీయ భద్రత, రక్షణపై ప్రస్తుత దృష్టికోణం' పేరిట జరిగిన సదస్సులో పాల్గొన్నారు షా. కశ్మీర్​ లోయలో ఆంక్షలు కొనసాగుతున్నాయని విపక్షాలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 196 పోలీస్​ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ ఎత్తివేసినట్లు తెలిపారు.

"అధికరణ 370, కశ్మీర్​ విషయంలో నేటికి చాలా వదంతులు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ అంశంపై కశ్మీర్​ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1947 నుంచి కశ్మీర్​పై వివాదం, చర్చ జరుగుతోందని మనకు తెలుసు. వక్రీకరించిన చరిత్ర ప్రజల ముందు ప్రదర్శించారు. కశ్మీర్​ చరిత్రను రాసే బాధ్యత తప్పులు చేసిన వారి చేతిలోనే ఉంది. దాని ఫలితంగానే నిజాలు కనుమరుగయ్యాయి. ప్రజల ముందు నిజమైన చరిత్రను ఉంచాల్సిన సమయం ఆసన్నమైంది."

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

జమ్ముకశ్మీర్​లో దశాబ్దాల నాటి ఉగ్రవాదంతో 41,800 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోతే మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ఎవరూ మాట్లాడలేదని మండిపడ్డారు షా. కానీ కొన్ని రోజులుగా సమాచార వ్యవస్థపై ఆంక్షలకు సంబంధించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మొబైల్​ కనెక్షన్లు లేకపోవటం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'భారత్​ను అస్థిర పరిచేందుకు పాక్​ కుట్రలు'

Last Updated : Oct 2, 2019, 11:20 AM IST

ABOUT THE AUTHOR

...view details