చైనాతో సరిహద్దు అంశమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సంభాషణ వార్తలపై భారత్ అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి. ఈ మధ్య కాలంలో అధ్యక్షుడు ట్రంప్‌తో.. ప్రధాని మోదీ మాట్లాడలేదని పేర్కొన్నాయి. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోదీతో సంభాషించానని ట్రంప్ ప్రకటించడంపై పైవిధంగా స్పందించాయి. డొనాల్డ్‌తో ఏప్రిల్ 4నే చివరిసారిగా ప్రధాని మోదీ మాట్లాడారని వెల్లడించాయి.
"2020, ఏప్రిల్ 4నే చివరిసారిగా ట్రంప్‌తో హైడ్రాక్సీ క్లోరోక్విన్ అంశమై ప్రధాని మోదీ సంభాషించారు. చైనా విదేశాంగ శాఖతో సంప్రదింపుల అంశమై చర్చిస్తున్నట్లు గురువారమే ప్రకటించాం. దౌత్య విధానాల్లోనే సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నాం."
-భారత్ ప్రకటన