ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 58 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదనేది తమ వద్ద లేదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ప్రకటించింది. కొద్దిరోజులుగా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు తగ్గించేందుకు కేంద్రం యోచిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సభ్యులు ప్రభుత్వ వివరణ కోరారు. ఈ మేరకు లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సిబ్బంది వ్యవహారాల శాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది.
6 లక్షలకుపైగా ఖాళీలు..
వివిధ కేంద్ర శాఖల్లో 6.83 లక్షల ఖాళీలు ఉన్నాయని లోక్సభలో వెల్లడించింది సిబ్బంది వ్యవహారాల శాఖ. 38, 02, 779 ఉద్యోగాలను కేంద్రం మంజూరు చేయగా 2018... మార్చి1 నాటికి 31,18, 956 పోస్టులను భర్తీ చేసినట్లు లోక్సభలో సమాధానమిచ్చింది.