గేదె మాంసం, చేపల ఎగుమతిని నిషేధించాలంటూ ఎటువంటి ప్రతిపాదన రాలేదని రాజ్యసభలో తెలిపారు కేంద్ర పశు సంవర్థక సహాయ మంత్రి సంజీవ్ కుమార్. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు. రూ.70 వేల కోట్ల విలువ చేసే గేదె మాంసాన్ని, చేపలను భారత్ ఎగుమతి చేస్తోందని చెప్పారు.
ఆ మాంసాన్ని నిషేధించే ఆలోచన లేదు: కేంద్రం
గేదె మాంసం, చేపల ఎగుమతిని నిషేధించాలని ఎటువంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర పశుసంవర్థక శాఖ సహాయమంత్రి సంజీవ్ కుమార్ రాజ్యసభలో తెలిపారు. గో సంరక్షణశాలల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు.
గేదె మాంసంపై నిషేధం ఆలోచన లేదు: కేంద్రమంత్రి
గో సంరక్షణశాలల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు సంజీవ్. జంతు పరిరక్షణ బోర్డు ఆవుల పరిరక్షణకు రూ.4 కోట్లు విడుదల చేసిందని, అంతకు మించి సహాయం చేయలేదని తెలిపారు. ఈ మొత్తాన్ని ఆవులను సంరక్షించే వారికి వేతనాలుగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:'మధ్య'భారతంలో కొత్త సమీకరణలు.. కలహాల్లో కాంగ్రెస్