తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫోన్​ ట్యాపింగ్​: రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం

ఛత్తీస్​గఢ్​ ఐపీఎస్​ అధికారికి సంబంధించిన ఫోన్​ను ట్యాపింగ్​ చేయటాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే హక్కు మీకు ఎక్కడిదంటూ ప్రశ్నించింది.

ఫోన్​ ట్యాపింగ్​: రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం

By

Published : Nov 4, 2019, 3:45 PM IST

ఫోన్​ ట్యాపింగ్ కేసులో ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సీనియర్​ ఐపీఎస్​ అధికారి, అతని కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్​ చేయటాన్ని తప్పుబట్టింది. ఎవరికీ ఎలాంటి వ్యక్తిగత గోప్యత లేకుండా చేశారని వ్యాఖ్యానించింది.

ఈ కేసును విచారించిన సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్​ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ ధర్మాసనం.. ఈ విధంగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే హక్కు మీకు ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఫోన్​ ట్యాపింగ్​ చేయటానికి ఎవరు ఆదేశించారు? వాటికి కారణాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

సీఎం ప్రస్తావన రావద్దు..

ఐపీఎస్​ అధికారి తరఫు న్యాయవాది మహేశ్ జెఠ్మలానీకి ఊరట కల్పించింది సుప్రీం. ఆయనపై దాఖలైన ఎఫ్​ఐఆర్​.. విచారణపై న్యాయస్థానం స్టే విధించింది. అంతేకాకుండా ఛత్తీస్​గఢ్​ సీఎం ప్రస్తావన తీసుకొచ్చి ఈ కేసును రాజకీయం చేయొద్దని జెఠ్మలానీకి సూచించింది. పిటిషన్లలో ముఖ్యమంత్రి పేరును తొలగించాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: చుక్క నీటి కోసం.. నగరాలకు కష్టకాలం!

ABOUT THE AUTHOR

...view details