ప్రపంచంలో ఏ శక్తి కూడా.. హాథ్రస్ బాధితురాలి కుటుంబ సభ్యుల గొంతును అణచివేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ఉద్రిక్తతల మధ్య.. బూల్గదిలోని బాధితురాలి కుటుంబసభ్యులను కాంగ్రెస్ బృందం పరామర్శించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్, ప్రియాంక గాంధీ 'అప్పటివరకు పోరాటం ఆగదు...'
బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు తమ పోరాటం ఆగదని ప్రియాంక గాంధీ తేల్చిచెప్పారు. కుటుంబ సభ్యులకు బాధితురాలి చివరి చూపు కూడ దక్కలేదన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన బాధ్యతలను అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.
మీడియాతో మాట్లాడుతున్న రాహుల్- ప్రియాంక అనుమతి లేదని...
అంతకుముందు.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మధ్యాహ్నం దిల్లీ నుంచి హాథ్రస్కు బయలుదేరారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వారిని అనుసరించారు.
ఇదీ చూడండి:-హాథ్రస్ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సీఎం సిఫార్సు
అయితే రాహుల్ గాంధీ బృందానికి హాథ్రస్లో పర్యటించేందుకు అనుమతులు లేవని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో బృందాన్ని అడ్డుకునేందుకు దిల్లీ-నోయిడా వంతెన వద్ద భారీగా బలగాలను మోహరించారు.
కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు- పోలీసుల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రియాంక గాంధీ ప్రయత్నించారు.
అనంతరం హాథ్రస్లో పర్యటించడానికి రాహుల్కు అనుమతి లభించింది. అయితే కేవలం ఐదుగురే హాథ్రస్కు వెళ్లొచ్చని అధికారులు పేర్కొన్నారు. ఫలితంగా రాహుల్, ప్రియాంక వెంట అధిర్ రంజన్ చౌదరి, కేసీ వేణుగోపాల్ హాథ్రస్కు వెళ్లి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు.
బాధితురాలి కుటుంబసభ్యులతో నేతలు దర్యాప్తుపై అసంతృప్తి...
ఘటన దర్యాప్తుపై హత్యాచార బాధితురాలి సోదరుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రశ్నలకు ఇంకా ఎలాంటి సమాధానాలు లభించలేదన్నారు. తమ కుటుంబాన్ని బెదిరించిన జిల్లా మేజిస్ట్రేట్ ఇంకా సస్పెండ్ అవ్వలేదని.. బయట తిరుగుతున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:-'బాధిత కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం'