అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఏ శక్తి అడ్డుకోలేదన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిశ్రమ్పుర్ నియోజకవర్గం పండు బహిరంగ సభలో ప్రసంగించారు రాజ్నాథ్.
"మేం ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు చట్టాలు తీసుకురాము. మేము దేశాన్ని నిర్మించడానికే చట్టాలు చేస్తాం. మేము దేశ అభివృద్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటాం. మేము రామ మందిరం నిర్మిస్తాం అని చెప్పినప్పుడు అందరూ ఏమన్నారు? భాజపా వాళ్లు ఎన్నేళ్లు ఇలా దేశ ప్రజల కళ్లలో మట్టికొడుతూ ఉంటారు అన్నారు. అప్పుడు కచ్చితంగా రామ మందిరం నిర్మాణం జరుగుతుంది అని మేము బదులిచ్చాం. ఇక సుప్రీం తీర్పు వచ్చేసింది. రాముడు పుట్టిన ఆ స్థలంలో ప్రపంచంలో గొప్ప మందిరం నిర్మాణం జరగకుండా ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదు."
-రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి