అవినీతి పరులకు పాస్‌పోర్టు జారీ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్‌లో ఉన్న లేదా అవినీతి ఆరోపణల కేసులతో సంబంధమున్న ప్రభుత్వ ఉద్యోగులకు పాస్‌పోర్టు ఇవ్వకూడదని సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. విదేశీ వ్యవహారాల శాఖ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌తో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రస్తుత నిబంధనలకు మార్పులు చేసింది.
ఇక నుంచి పాస్‌పోర్టు కావాలనుకునే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి విజిలెన్స్ క్లియరెన్స్ తప్పనిసరి. ఒకవేళ ఉద్యోగిపై ఏమైనా నేరారోపణలు ఉంటే పాస్‌పోర్టు జారీని నిలిపివేసే అధికారం విజిలెన్స్ కమిషన్‌కు ఉంటుందని ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. అవినీతి నిరోదక చట్టం కింద కేసు నమోదైన ఉద్యోగులకూ పాస్‌పోర్టు అనుమతి నిరాకరించొచ్చు.