పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న వేళ...కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు సూచనలు జారీ చేసింది. హింసాత్మక ఘటనలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.
హింసను ప్రోత్సహించే తప్పుడు వార్తలు, వదంతులు సోషల్ మీడియాలో వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని సూచించింది.