చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ భద్రతకై నిత్యం అప్రమత్తంగా ఉంటోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. దేశ భూభాగంలోని ఒక్క అంగుళం కూడా ఎవరు ఆక్రమించుకోలేరన్నారు.
భారత్- చైనా ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ప్రభుత్వం మిలిటరీ-దౌత్య స్థాయిలో అన్ని చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు షా.
"మన భూభాగంలోని ప్రతి అంగుళాన్ని కాపాడుకునేందుకు మేము అప్రమత్తంగా ఉన్నాం. ఎవరూ ఆక్రమించుకోలేరు. దేశ సార్వభౌమాధికారం, సరిహద్దును రక్షించుకునే శక్తి మన భద్రతా బలగాలకు, నాయకత్వానికి ఉంది."
--- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి