తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాను జయించిన 25 లక్షల మంది - కరోనా రికవరీ రేటు

భారత్​లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 25 లక్షలు దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్​ మరణాల రేటు స్థిరంగా క్షీణిస్తుందని తెలిపింది.

No. of COVID recoveries goes past 25 lakh in India: Health ministry
25 లక్షలు దాటిన కొవిడ్​ రికవరీలు- తగ్గుతున్న మరణాలు

By

Published : Aug 27, 2020, 6:24 PM IST

Updated : Aug 27, 2020, 6:32 PM IST

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ... రికవరీలు అధికంగానే ఉన్నాయి. ఇప్పటివరకు కొవిడ్​ను జయించిన వారి సంఖ్య 25 లక్షలు దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరణాల రేటులో నిరంతరం క్షీణత కనిపిస్తోందని, కరోనా పరీక్షలు కూడా జోరుగానే సాగుతున్నాయని తెలిపింది.

మహారాష్ట్రలో 7 లక్షల ప్లస్​

ఆరోగ్య శాఖ తెలిపిన కీలక అంశాలు..

  • దేశంలో బుధవారం ఒక్కరోజే 9 లక్షలకు పైగా కొవిడ్​ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 3 కోట్ల 85 లక్షల నమూనాలను టెస్ట్​ చేశారు.
  • ఇప్పటివరకు 25,23,771 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఫలితంగా రికవరీ రేటు 76.24కు పెరిగింది.
  • ప్రస్తుతం దేశంలో 21.93 శాతం యాక్టివ్ కేసులున్నాయి.
  • కొవిడ్​ మరణాల రేటు 1.83కు తగ్గింది.
  • దేశంలో కరోనా టెస్టింగ్​ ల్యాబ్​ సంఖ్య 1,550కు పెంచాం.

రికవరీ రేటులో తొలి స్థానంలో..

భారత్​లో కేసుల వివరాలు

దేశంలోనే దిల్లీ 90 శాతం రికవరీ రేటుతో ప్రథమ స్థానంలో ఉంది. తమిళనాడు 85 శాతం, బిహార్​ 83.80 శాతం, గుజరాత్ 80.20 శాతం, రాజస్థాన్​ 79.30 శాతం, అసోం, బంగాల్ రాష్ట్రాలు​ 79.10 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

మరణాల రేటులో

అసోంలో కొవిడ్​ మరణాలు అత్యల్పంగా 0.27 శాతం నమోదు కాగా... ఝార్ఖండ్​లో అత్యధికంగా 1.09 శాతం మంది వైరస్​తో చనిపోయారు.

ఇదీ చూడండి:సానుకూలంగా 'కొవిషీల్డ్​' వ్యాక్సిన్ మొదటి డోసు ఫలితాలు

Last Updated : Aug 27, 2020, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details