తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో రోజుకు 18వేల కరోనా పరీక్షలు - అమిత్​ షా

ఈ నెల 20 నుంచి దిల్లీలో రోజుకు 18వేల కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. కేంద్రమంత్రి అమిత్​ షా నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. దిల్లీలో మరోమారు లాక్​డౌన్​ను విధించే ప్రణాళికలేమీ లేవని ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ స్పష్టం చేశారు.

No. of COVID-19 tests to be increased to 18,000 per day in Delhi from June 20
దిల్లీలో రోజుకు 18వేల కరోనా పరీక్షలు

By

Published : Jun 15, 2020, 4:01 PM IST

దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నేతృత్వంలో జరిగిన భేటీలో.. ఈ నెల 20 నుంచి దిల్లీవ్యాప్తంగా రోజుకు 18వేల కరోనా పరీక్షలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.

రాజకీయ విభేదాలను పక్కనపెట్టి.. కరోనాపై పోరులో ముందుకు సాగాలని అధికార ఆమ్​ ఆద్మీ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం భాజపా పిలుపునిచ్చాయి. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆప్​ రాజ్యసభ ఎంపీ సంజయ్​ సింగ్​ వెల్లడించారు. ఆసుపత్రుల్లో కరోనా బాధితుల కోసం పడకలను పెంచే విషయంపైనా భేటీలో చర్చించినట్టు పేర్కొన్నారు. అధికంగా ఛార్జీలు చేస్తున్న ఆసుపత్రులపై కేంద్రం ఓ నివేదికను అందిస్తుందని.. అనంతరం సంబంధిత వ్యక్తులపై చర్యలు చేపడతామని హామీనిచ్చారు.

అఖిలపక్ష సమావేశం

అయితే.. కేంద్రం, దిల్లీ ప్రభుత్వాల వైఫల్యాల వల్లే దేశ రాజధానిలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోందని ఆరోపించింది కాంగ్రెస్​. చివరి ఏడాది విద్యాభ్యాసం చేస్తున్న వైద్య విద్యార్థులను రంగంలోకి దింపి కరోనా పరీక్షలను విస్తృతం చేయాలని సూచించింది.

'లాక్​డౌన్​ ప్రణాళిక లేదు..'

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీలో మరోమారు లాక్​డౌన్​ ఆంక్షలు విధించే అవకాశముందన్న ఊహాగానాలకు తెరదించారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్​. లాక్​డౌన్​ విధించే ప్రణాళికలేమీ లేవని స్పష్టం చేశారు.

దిల్లీలో కరోనా కేసుల సంఖ్య 41వేలు దాటింది. 1,300 మందికిపైగా మృతిచెందారు.

ఇదీ చూడండి:-దిల్లీలో కరోనా తీవ్రం.. 6 రోజుల్లోనే 10వేల కేసులు

ABOUT THE AUTHOR

...view details