దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో ఉత్తరాఖండ్‌లో అసలు కొత్త కేసులు నమోదు కాకపోవటం గమనార్హం. వరుసగా నాలుగోరోజు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు వైరస్ బారిన పడినవారి సంఖ్య 35 మాత్రమే. అందులో ఐదుగురు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు.
ఆ రాష్ట్రంలో 4వ రోజూ కరోనా కేసులు సున్నానే - ఉత్తరాఖండ్
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఉత్తరాఖండ్‌పై వైరస్ ప్రభావం కనిపించటం లేదు. వరుసగా నాలుగో రోజు ఒక్క కేసు నమోదు కాలేదు.
ఉత్తరాఖండ్‌లో కరోనా కట్టడి స్కెచ్ హిట్
లాక్‌డౌన్‌కు తోడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలే కొత్త కేసులు నమోదు కాకపోవటానికి కారణంగా చెబుతున్నారు అధికారులు.
ఇదీ చూడండి: కరోనా కలవరం: 'మహా'లో 134, రాజస్థాన్‌లో 96 కొత్త కేసులు