తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'యుద్ధంతో కాదు.. ప్రేమతో స్వాధీనం చేసుకుందాం' - పాక్ ఆక్రమిత కశ్మీర్

పాక్​ ఆక్రమిత కశ్మీర్​ను భారత్​లో విలీనం చేసేందుకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదని కశ్మీర్​ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అభిప్రాయపడ్డారు. కశ్మీర్​ అభివృద్ధి చూసిన తరువాత పాక్ ఆక్రమిత (పీవోకే) ప్రజలే భారత్​లో చేరుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా కశ్మీరీలను ప్రేమగా, గౌరవంగా చూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.​

'యుద్ధంతో కాదు.. ప్రేమతో స్వాధీనం చేసుకుందాం'

By

Published : Sep 19, 2019, 5:45 AM IST

Updated : Oct 1, 2019, 3:53 AM IST

'యుద్ధంతో కాదు.. ప్రేమతో స్వాధీనం చేసుకుందాం'

పాక్​ ఆక్రమిత కశ్మీర్​ (పీవోకే)ను బలవంతంగా భారత్​లో కలుపుకోవాల్సిన అవసరం లేదని కశ్మీర్​ గవర్నర్​ సత్యపాల్​ మాలిక్ వ్యాఖ్యానించారు. కశ్మీర్​లో ప్రణాళికాబద్ధమైన ​అభివృద్ధిని చూసిన తరువాత వారే పాక్​పై తిరుగుబాటు చేసి భారత్​లో చేరుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

"గత 10 నుంచి 15 రోజులుగా చూస్తున్నాను. మన మంత్రులు చాలా మంది పీవోకేపై దండయాత్ర చేసి, దానిని భారత్​లో కలపడం గురించి పదేపదే మాట్లాడుతున్నారు. నా నమ్మకం ఏంటంటే... జమ్ము కశ్మీర్​ను అభివృద్ధి చేయడం ద్వారా పీవోకేను భారత్​లో విలీనం చేసుకోగలుగుతాం."
- సత్యపాల్​ మాలిక్, జమ్ము కశ్మీర్ గవర్నర్​

ప్రేమించండి.. గౌరవించండి

కశ్మీర్​ ప్రజలను దేశ ప్రజలంతా ప్రేమించాలి, గౌరవించాలని గవర్నర్ సత్యపాల్​ మాలిక్ కోరారు.

"మనం జమ్ము కశ్మీర్​ ప్రజలకు ప్రేమ, గౌరవం ఇవ్వాలి. వారి పిల్లల భవిష్యత్​కు భద్రత కల్పించాలి. అలాగే వారి అభివృద్ధి, శ్రేయస్సును తీసుకురాగలగాలి. అలా చేయగలిగితే కచ్చితంగా ఒక్క సంవత్సరంలోగా పీవోకేలో తిరుగుబాటు చెలరేగుతుందని నేను హామీ ఇవ్వగలను. అపుడు పాక్​తో ఎలాంటి పోరు చేయాల్సిన అవసరం ఉండదు. పీవోకే ప్రజలే స్వచ్ఛందంగా భారత్​లోకి రావాలని కోరుకుంటారు. పీవోకే విషయంలో ఇదే నా ప్రణాళిక."
- సత్యపాల్​ మాలిక్, జమ్ము కశ్మీర్ గవర్నర్​

కశ్మీరీ విద్యార్థుల కోసం

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సుమారు 22 వేల మంది కశ్మీరీ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి సహాయం చేయడానికి ప్రతి రాష్ట్రంలోనూ అధికారులను నియమించినట్లు సత్యపాల్​ మాలిక్​ పేర్కొన్నారు. కశ్మీరీలను దేశ ప్రజలంతా ప్రేమగా చూసుకోవాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి: సుప్రీంలో నలుగురు నూతన న్యాయమూర్తుల నియామకం

Last Updated : Oct 1, 2019, 3:53 AM IST

ABOUT THE AUTHOR

...view details