మహారాష్ట్రలో గతకొద్ది రోజులుగా రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఇటీవలే రాష్ట్రపతి పాలన విధించింది కేంద్రం. ఈ పరిస్థితులు చూస్తుంటే.. మహారాష్ట్ర మధ్యంతర ఎన్నికల దిశగా సాగుతోందని అందరూ భావిస్తున్నారు. అయితే తాజాగా ఈ ఊహాగానాలను కొట్టి పారేశారు ఎస్సీపీ అధినేత శరద్ పవార్. మధ్యంతర ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని.. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నట్లు పవార్ చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వ విధివిధానాలకు దిశానిర్దేశం చేసేలా.. మూడు పార్టీల ప్రతినిధులతో 'కనీస ఉమ్మడి కార్యక్రమం(సీఎంపీ)'ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
" మధ్యంతర ఎన్నికలకు ఆస్కారమే లేదు. ఐదేళ్లపాటు కొనసాగేలా శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం."
-శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
ఫడణవీస్పై విమర్శలు
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఎన్నికల సందర్భంగా చెప్పిన.. 'మీ పున్హా యెన్(మళ్లీ నేనే వస్తా)' నినాదంపై శరద్ పవార్ విమర్శలు చేశారు. తనకు దేవేంద్రతో చాలా ఏళ్లుగా పరిచయం ఉన్నా.. ఆయన జోతిష్య విద్యార్థి అని తెలియదని ఎద్దేవా చేశారు పవార్.
సేన హిందుత్వవాదానికి మద్దతిస్తారా?