పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు పాత పత్రాలు సమర్పించమని ఏ భారతీయుడినీ వేధించబోమని కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. 1971 కంటే ముందు కాలం నాటి తల్లిదండ్రులు, తాతల జనన ధ్రువీకరణ పత్రాలు, ఇతర గుర్తింపు పత్రాలు చూపించమని ఏ పౌరుడినీ వేధించడం జరగదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.
నిరక్షరాస్యులైన పౌరులకు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోతే.. స్థానికులు ఇచ్చే సాక్ష్యం, రుజువులు ఆధారంగా చూపిస్తే సరిపోతుందని కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
"పుట్టిన ప్రదేశం, తేదీ లేదా రెండింటికీ సంబంధించిన పత్రాలను సమర్పించడం ద్వారా భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవచ్చు. దీనికి మరికొన్ని పత్రాలు జతచేస్తే సరిపోతుంది. భారతీయ పౌరులు అనవసరంగా వేధింపులు, అసౌకర్యాలకు గురికావడం జరగదు."
- కేంద్రహోంమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి