తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టాప్​ 300లో ఒక్క భారత విద్యాసంస్థ కూడా లేదు! - (HRD)

2020 సంవత్సరానికి గానూ టైమ్స్​ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రపంచ వ్యాప్తంగా విద్యాసంస్థల ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితా టాప్​ 300లో ఒక్క భారత విద్యాసంస్థకు కూడా చోటుదక్కలేదు.

టాప్​ 300లో ఒక్క భారత విద్యాసంస్థ కూడా లేదు!

By

Published : Sep 12, 2019, 10:19 PM IST

Updated : Sep 30, 2019, 9:39 AM IST

ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ 300 అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఈ సారి భారత్‌ నుంచి ఏ ఒక్క ఇనిస్టిట్యూట్‌ చోటు దక్కించుకోలేకపోయింది. టాప్‌ 300లో భారత విద్యాసంస్థలు లేకపోవడం 2012 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

పడిపోయిన ఐఐఎస్​సీ

2020 సంవత్సరానికి గానూ టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థల ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలోని తొలి 300ల్లో భారత్‌ నుంచి ఒక్క ఇనిస్టిట్యూట్‌ కూడా లేదు. గతేడాది టాప్‌-300లో చోటు దక్కించుకున్న ఏకైక భారత విద్యాసంస్థ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) బెంగళూరు కూడా ఈ సారి 301-350 ర్యాంక్‌ గ్రూప్‌కు పడిపోయింది. మరో విద్యాసంస్థ ఐఐటీ-రోపర్‌ కూడా 301-350 గ్రూప్‌లో చోటుదక్కించుకుంది. ఇక ఐఐటీ ఇండోర్‌ 351-400 ర్యాంక్‌ గ్రూప్‌లో ఉంది. ఐఐటీ ముంబయి, దిల్లీ, ఖరగ్‌పూర్‌ విద్యాసంస్థలు 401-500 ర్యాంక్‌ గ్రూప్‌లో చోటు దక్కించుకున్నాయి.

ఆక్స్​ఫోర్డ్​కే అగ్రస్థానం

ఇక వరుసగా నాలుగోసారి ఆక్స్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి రెండో ర్యాంక్‌ రాగా.. కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ, మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.

Last Updated : Sep 30, 2019, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details