ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను కచ్చితంగా ధరించాలనే నిబంధనలను కోల్‌కతా పోలీసులు మరింత కఠినతరం చేశారు. ద్విచక్ర వాహనంపై ఉన్నవారు హెల్మెట్ ధరించకుండా పెట్రోల్ బంక్‌కు వెళితే వారికి పెట్రోల్ పోయకూడదు అనే నిబంధనను తీసుకొచ్చారు. డిసెంబర్ 8 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.
'హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల్లోకి వచ్చే వాహనదారులకు పెట్రోల్ పోయకూడదు. కోల్‌కతా నగర పరిధిలోకి వచ్చే అన్ని పెట్రోల్ బంకులకు ఈ నిబంధన వర్తిస్తుంది. బైక్‌పై ఇద్దరు వ్యక్తులుంటే వారిద్దరికీ హెల్మెట్ ఉంటేనే ఇంధనం పోయాలి' అని పోలీసు శాఖ ప్రకటన విడుదల చేసింది.