కంటైన్మెంట్ జోన్లలో పండుగ సీజన్లో కరోనా నియంత్రణకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు జారీ చేసింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇళ్లలోనే పండుగలను నిర్వహించుకోవాలని ప్రజలను కోరింది.
పండుగలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలను కంటైన్మెంట్ జోన్లకు అవతలనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఆయా కార్యక్రమాల ఏర్పాట్లపై స్థానిక అధికారుల పర్యవేక్షణ ఉండాలని నిర్దేశించింది. థర్మల్ స్క్రీనింగ్, భౌతిక దూరం, శుభ్రత వంటి అంశాలను నిశితంగా పరిశీలించాలని సూచించింది.