తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారంతా నేడు పదవీ విరమణ చేయాల్సిందే' - corona retirement

మార్చి 31 నాటికి పదవీ విరమణకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు గడువు పెంచబోమని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. వారి విధి నిర్వహణకు నేడు చివరి రోజని స్పష్టం చేసింది.

No extension in retirement date for central govt employees due to retire on March 31
'వారంతా పదవీ విరమణ చేయాల్సిందే'

By

Published : Mar 31, 2020, 3:00 PM IST

మార్చి 31న(నేడు) పదవీ విరమణ చేయనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గడువు పెంచేది లేదని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

అందరికీ తప్పదు...

కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించింది కేంద్రం. పరిస్థితుల దృష్ట్యా చాలా మంది ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. కొంత మంది కార్యాలయాల్లోనూ విధులు నిర్వహిస్తున్నారు. అయితే 2020 మార్చి 31 నాటికి పదవీ విరమణ చేయాల్సిన వారంతా ఎక్కడున్నా ప్రభుత్వ సేవల నుంచి తప్పుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details