పండుగలు, ముఖ్యమైన రోజుల్లో భారత్-పాక్ సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయాన్ని మరోమారు విస్మరించింది పొరుగు దేశం. ఫలితంగా... పాక్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సరిహద్దు బలగాలు స్వీట్లు పంచుకునే కార్యక్రమం జరగలేదు.
స్వాతంత్య్ర దినోత్సవమైనా స్వీట్లు ఇవ్వని పాక్! - panjab
పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అత్తారీ-వాఘా సరిహద్దులో భారత్-పాక్ సరిహద్దు బలగాలు మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మాత్రం ఆ కార్యక్రమం నిర్వహణకు నిరాకరించింది పాక్.
స్వాతంత్య్ర దినోత్సవమైనా స్వీట్లు ఇవ్వని పాక్!
అత్తారీ-వాఘా సరిహద్దు వద్ద ఈద్, ఇరు దేశాల స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీ. అయితే... ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటోంది పాక్. బక్రీద్ సందర్భంగా మిఠాయిలు పంచుకోవడంపై భారత సరిహద్దు భద్రతా దళం అధికారులు సమాచారం ఇచ్చినా... పొరుగు దేశం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఈరోజూ అదే పునరావృతమైంది.
ఇదీ చూడండి: జమ్ములో ఆంక్షల ఎత్తివేత- కశ్మీర్లో పాక్షికంగా అమలు
Last Updated : Sep 27, 2019, 12:17 AM IST