తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనేందుకు ఆధారాల్లేవ్​' - corona virus latest news

కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని స్పష్టమైన ఆధారాలు లేవని ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా ఈ విషయాన్ని ధ్రువీకరించలేమని ఈటీవీ భారత్​తో ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ లోకేశ్ శర్మ స్పష్టం చేశారు.

COVID
కరోనా

By

Published : Jul 7, 2020, 5:08 AM IST

కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు ఎటువంటి ఆధారం లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పునరుద్ఘాటించింది. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడిన ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ లోకేశ్ శర్మ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

"గాలి ద్వారా కరోనా వైరస్ సంక్రమిస్తుందనే విషయంలో ఎలాంటి ఆధారం లేదు. ఇందుకు సంబంధించి కొన్ని వాదనలు ఉండవచ్చు. కరోనా వైరస్ తనను తాను మార్చుకుంటోంది. ఇది కొత్తగా పుట్టుకొచ్చిన అంటువ్యాధి. వైరస్ వ్యాప్తి విధానాలకు సంబంధించి క్లినికల్ స్టడీస్, పరిశోధన, రుజువులు ఉంటేనే నిర్ధరించగలం."

- డాక్టర్ లోకేశ్ శర్మ

గాలిలో ఉండే చిన్న చిన్న కణాల ద్వారా కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపింది ఓ శాస్త్రవేత్తల బృందం. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేసింది. వైరస్‌ వ్యాప్తి కట్టడికి సంబంధించిన సూచనలు, సిఫార్సులను సవరించాలని డబ్ల్యూహెచ్‌ఓకు సూచించింది.

కరోనా బాధితులు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వెలువడే తుంపర్లు గాలిలోని చిన్న కణాల్లోకి ప్రవేశించి.. ఒక గది వంటి నిర్దేశిత ప్రాంతంలో తిరుగుతూ వైరస్‌ను వ్యాప్తి చేస్తాయని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. ఇందుకు భిన్నంగా డబ్ల్యూహెచ్‌ఓ కేవలం బాధితుల తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని చెబుతోంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details