తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'శివసేనతో సీఎం పదవిపై ఒప్పందం జరగలేదు' - bjp not sharing the chief minister's post with ally Shiv Sena.

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభనపై స్పందించారు కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ. ఎన్నికల ముందు భాజపా, శివసేన మధ్య ముఖ్యమంత్రి పదవపై ఎలాంటి ఒప్పందం జరగలేదని స్పష్టం చేశారు.

'శివసేనతో సీఎం పదవిపై ఒప్పందం జరగలేదు'

By

Published : Nov 8, 2019, 5:43 PM IST

Updated : Nov 8, 2019, 7:07 PM IST

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. శివసేన 50-50 ఫార్ములాపై పట్టు వీడని నేపథ్యంలో కేంద్ర మంత్రి, భాజపా సీనియర్​ నేత నితిన్​ గడ్కరీ స్పందించారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో భాజపా-శివసేన మధ్య ఎలాంటి ఒప్పందాలు జరగలేదని స్పష్టం చేశారు.

'భాజపా- శివసేన మధ్య ముఖ్యమంత్రి పదవిని పంచుకునే విషయంలో ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. దివంగత నేత బాల్​​ ఠాక్రే ఉన్నప్పుడూ ఇరు పార్టీల మధ్య ఎన్నికల సమయంలో శాసనసభ్యుల సీట్ల మధ్య మాత్రమే ఒప్పందం జరిగేవి.. ముఖ్యమంత్రి పదవి కోసం కాదు'

- నితిన్​ గడ్కరీ, కేంద్ర మంత్రి.

గడ్కరీ ప్రకటనతో ఇరుపార్టీల మధ్య మరోసారి విమర్శలు వెల్లువెత్తే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత నెలలో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో భాజపా 105, శివసేన 56 సీట్లల్లో గెలుపొందింది. కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమున్నా.. ముఖ్యమంత్రి పీఠంపై ఇరు పార్టీల మధ్య ప్రతిష్టంభన నెలకొంది.

ఇదీ చూడండి:'పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు'

Last Updated : Nov 8, 2019, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details