దూర విద్యా విధానంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ). హోటల్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్ కోర్సులను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి తొలగించింది.
219-20 విద్యా సంవత్సరం నుంచి కులినరీ స్టడీస్, హోటెల్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్ మదింపుల కోర్సులు దూర విద్యలో చేసేందుకు వీలు లేదని తేల్చి చెప్పింది కమిషన్. ఇప్పటికే ఓపెన్, డిస్టెన్స్ డ్రిగ్రీలలో ప్రవేశం పొందిన వారికి మాత్రం గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసింది.
2017లో మెడికల్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సులను దూర విద్యలో నుంచి తొలగిస్తూ 2017లో నిబంధనలు రూపొందించింది యూజీసీ. తరువాత వ్యవసాయ కోర్సులనూ దూర విద్య నుంచి నిషేధించింది. ఇప్పుడు ఆ జాబితాలోకి హోటెల్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్ను కూడా చేర్చింది. ఈ కోర్సుల పట్ల క్షుణ్నమైన అవగాహన లేకపోతే.. వృత్తిని సక్రమంగా నిర్వర్తించలేరు కాబట్టే కొన్ని కీలక కోర్సుల విషయంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు గతంలోనే తెలిపింది యూజీసీ.