తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దినకరన్ పార్టీకి కుక్కర్ గుర్తు నిరాకరించిన సుప్రీం - EC

అన్నాడీఎంకే మాజీ నాయకుడు టీటీవీ దినకరన్​ పార్టీకి కుక్కర్​ గుర్తు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది సుప్రీం. వేరే చిహ్నం కేటాయించాలని ఈసీని ఆదేశించింది.

దినకరన్ పార్టీకి కుక్కర్ గుర్తు నిరాకరించిన ఈసీ

By

Published : Mar 26, 2019, 3:52 PM IST

అన్నాడీఎంకే మాజీ నేత టీటీవీ దినకరన్​కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దినకరన్​ నాయకత్వంలోని అమ్మ మక్కల్​ మున్నేట్ర కజగమ్​(ఏఎంఎంకే) పార్టీకి కుక్కర్​ గుర్తు ఇవ్వడం కుదరదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వేరే చిహ్నం కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

తీర్పుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి​ నేతృత్వంలోని ధర్మాసనం ఎన్నికల సంఘానికి మరింత స్పషత ఇచ్చింది. ఏఎంఎంకే పార్టీకి గుర్తింపునివ్వడం తమ పని కాదని సుప్రీం పేర్కొంది. గుర్తు మాత్రం కేటాయించాలని ఈసీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details