దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హస్తిన ప్రజల సమక్షంలోనే ప్రమాణస్వీకారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 16న రాంలీలా మైదానంలో జరగనున్న ఈ మహోత్సవానికి రాజకీయ నేతలను కానీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను గానీ ఆహ్వానించడం లేదని ఆప్ విభాగం కన్వినర్ గోపాల్ రాయ్ స్పష్టం చేశారు.
తన నాయకత్వంపై విశ్వాసం ఉంచిన దిల్లీ ప్రజల మధ్యే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు. ప్రమాణస్వీకార కార్యక్రమం దిల్లీకే ప్రత్యేకమని వెల్లడించారు.