చైనా దళాలు భారత సరిహద్దులోకి వచ్చి వెళ్లాయన్న వార్తలను ఖండించారు అధికారులు. స్థానికులు, ఐటీబీపీ(ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్) అధికారుల భేటీ అనంతరం.. సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన ఓ వీడియోపై స్పష్టతనిచ్చారు. ఆ వీడియో పాతదని, ఎలాంటి చొరబాట్లు జరగలేదని అధికారులు స్పష్టంచేశారు.
'చైనా దళాల చొరబాటు వార్త అవాస్తవం'
భారత భూభాగంలోకి చైనా సైన్యం ప్రవేశించిందంటూ వస్తోన్న కథనాలు అవాస్తవమని పేర్కొన్నారు అధికారులు. వైరల్ అవుతున్న వీడియో పాతదని స్పష్టంచేశారు.
'చైనా దళాలు దేశంలోకి ప్రవేశించాయన్న వార్తలు అవాస్తవం'
ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయని.. స్థానికులు ఆ ప్రాంతంలో ఎప్పుడూ సంచరిస్తుంటారని అధికారులు వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల వారు తమ పెంపుడు జంతువులకు ఆహారం కోసం ఇలా పరిసరాల్లో తిరుగుతూ ఉంటారని చెప్పుకొచ్చారు. ఇది సైనిక విభాగానికి సంబంధించిన సమస్య కాదని వారు వివరణ ఇచ్చారు.
ఇదీ చదవండి:బ్రిటన్ నుంచి భారత్కు విమానాలు బంద్