తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"ఛాయ్​ పే చర్చ"కు ఛాయ్​వాలా నో - no polictical discussion

ఛాయ్​పే చర్చ అంటే ఇష్టపడని వారు ఎవరు? స్నేహితులతో టీ​ తాగుతూ రాజకీయాలపై చర్చించడం అందరికీ ఇష్టమే. కానీ శృతి మించితేనే గొడవలకు దారి తీస్తుంది. అందుకే... కర్ణాటక మండ్యలోని ఓ హోటల్ యజమాని ఓ నిర్ణయం తీసుకున్నాడు. అందరూ దాన్ని ఆమోదించారు.

"ఛాయ్​ పే చర్చ"కు ఛాయ్​వాలా నో

By

Published : Mar 20, 2019, 5:40 AM IST

Updated : Mar 20, 2019, 9:15 AM IST

"ఛాయ్​ పే చర్చ"కు ఛాయ్​వాలా నో
సామాన్యుల రాజకీయ చర్చలకు మంచి అడ్డా అంటే గుర్తొచ్చేది ఛాయ్​ దుకాణమే. టీ రుచిని ఆస్వాదిస్తూ... పంచాయతీ మొదలు అంతర్జాతీయ రాజకీయాలు, నేతల గురించి ఎన్నో మాట్లాడుకుంటాం. అందుకే నరేంద్ర మోదీ 'ఛాయ్​పే చర్చ' పేరిట వినూత్న ప్రచార కార్యక్రమం నిర్వహించి, సఫలమయ్యారు.

కర్ణాటక మండ్యలోని వడిరాజ కాఫీ సెంటర్​లో పరిస్థితి భిన్నం. అందులోకి వెళ్లగానే 'దయచేసి రాజకీయ విషయాలు మాట్లాడవద్దు. కాఫీ, టీ తాగి క్షేమంగా వెళ్లి రండి' అనే బోర్డు కనిపిస్తుంది. ఇందుకు ఓ పెద్ద కారణమే చెబుతారు హోటల్​ యజమాని.

"సుమలత, నిఖిల్​ గౌడ అభిమానులు వస్తారు. రాజకీయ చర్చలు మొదలు పెట్టి గొడవలు పడతారు. వాళ్లను ఆపడానికి మేం మధ్యలో వెళ్లాల్సి వస్తుంది.
ప్ర: మరి ప్రస్తుతం వ్యాపారం ఎలా ఉంది?
గొడవల కన్నా ప్రస్తుత వ్యాపారమే బాగుంది."
-వడిరాజ కాఫీ సెంటర్​ యజమాని

"హోటల్​లో రాజకీయ విషయాలు మాట్లాడరాదన్న నిర్ణయం బాగుంది. చర్చలు పెట్టుకొని గొడవ పడే అవకాశమే లేదు. ఈ నిర్ణయం మాకు ఆమోదమే. ఇప్పుడు అందరూ వచ్చి కాఫీ, టీ తాగి... రాజకీయ విషయాలు మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు."
- వినియోగదారుడు

సుమలత, నిఖిల్ అభిమానులు గొడవపడే స్థాయికి మండ్య రాజకీయం ఎందుకు వెళ్లిందో తెలుసుకునేందుకు ఇవి చూడండి:

రెబల్​ స్టార్​పై నిలిచి గెలిచేనా?

దంగల్​ 2019: జాగ్వర్​ X​ జట్కా

Last Updated : Mar 20, 2019, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details