నైరుతి రుతుపవనాల రాక ఆలస్యంతో జూన్లో 33 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీని కారణంగా ఇప్పటికే వేయాల్సిన పంటలు ఆలస్యమయ్యాయి. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం వర్షాల గురించి భయపడాల్సిన పని లేదని పంట వేయడం ప్రారంభించాలని పిలుపునిచ్చారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. ప్రభుత్వం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తోందన్నారు.
భారత్కు కరవు పరిస్థితులేమి కొత్త కాదని, ఇప్పుడూ భయపడాల్సిన అవసరం లేదని తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయని తోమర్ వెల్లడించారు. ఖరీఫ్ పంటకు మద్దతు ధరపై రాబోయే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామన్నారు.