తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనాకు విరుగుడు వచ్చే వరకు నిర్లక్ష్యం వద్దు' - ప్రధానమంత్రి ఆవాస్ యోజన

కరోనాకు ఔషధం వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం తగదని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. మాస్కు, భౌతిక దూరం పాటించాలన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

MODI CORONA
మోదీ

By

Published : Sep 12, 2020, 1:19 PM IST

కరోనాకు విరుగుడు వచ్చే వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. ఔషధం వచ్చే వరకు నిర్లక్ష్యం తగదని నినదించారు.

మధ్యప్రదేశ్​లో ప్రధానమంత్రి ఆవాస్​ యోజన కింద నిర్మించిన 1.75 లక్షల ఇళ్ల ప్రారంభోత్సవంలో ఈ మేరకు సూచనలు చేశారు మోదీ. మాస్కు, భౌతిక దూరం పాటించటం తప్పనిసరి అని అన్నారు.

పేదరిక నిర్మూలన..

ఈ కార్యక్రమంలో దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్న మోదీ.. పేదరికాన్ని అంతం చేసేందుకు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేదల సాధికారతే లక్ష్యంగా ఆవాస్ యోజనను తీసుకొచ్చామని వెల్లడించారు.

ఇదే వేదికగా ఆవాస్ యోజన లబ్ధిదారులతో మోదీ ముచ్చటించారు.

ఇదీ చూడండి:కరోనా నియంత్రణలో మోదీ ప్రభుత్వం విఫలం: రాహుల్

ABOUT THE AUTHOR

...view details