తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​తో పొత్తు లేదు:మాయ - పొత్తు

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీతో చేతులు కలిపేది లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి తేల్చిచెప్పారు. ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసం పొత్తులు కుదుర్చుకుంటే తమ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని అన్నారు.

కాంగ్రెస్​తో పొత్తు లేదు: మాయావతి

By

Published : Mar 12, 2019, 5:17 PM IST

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకోబోమని తేల్చిచెప్పారు బహుజన్​ సమాజ్​వాదీ పార్టీ అధినేత్రి మాయావతి. భాజపాను గద్దెదింపడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్షాల మహాకూటమికి మాయావతి నిర్ణయంతో కాస్త ఎదురుదెబ్బ​ తగిలినట్టయింది.

భావసారుప్యత వల్లే సమాజ్​వాదీ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు బీఎస్పీ అధ్యక్షురాలు స్పష్టం చేశారు. దేశంలో... ముఖ్యంగా ఉత్తర​ప్రదేశ్​లో భాజపాను ఓడించే సామర్థ్యం ఎస్పీ- బీఎస్పీ కూటమికి ఉందని ధీమా వ్యక్తం చేశారు.

బీఎస్పీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన మాయావతి... ఎన్నో పార్టీలు తమతో పొత్తుకు సిద్ధపడ్డాయన్నారు. కానీ ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసమే పొత్తులు పెట్టుకుంటే బీఎస్పీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details