తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భద్రతా నిబంధనలు ఉల్లంఘించింది ప్రియాంక గాంధీనే' - ప్రియాంక స్కూటీ ప్రయాణం

ప్రియాంక గాంధీ లఖ్​నవూ పర్యటన సందర్భంగా ఆమె భద్రత విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని సీఆర్​పీఎఫ్​ స్పష్టం చేసింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రణాళికలో లేని కార్యక్రమాలను ప్రియాంక చేపట్టారని నివేదికలో పేర్కొంది. స్కూటీపై వెళ్లడం ద్వారా ఆమె నిబంధనలను ఉల్లంఘించారని తెలిపింది.

no-breach-in-priyanka-gandhis-security-crpf
'భద్రతా నిబంధనలు ఉల్లంఘించింది ప్రియాంక గాంధీనే'

By

Published : Dec 30, 2019, 1:13 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ పర్యటనలో భాగంగా ప్రియాంక గాంధీకి కల్పించే భద్రతలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని సీఆర్​పీఎఫ్​ స్పష్టంచేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, స్కూటీ​పై వెళ్లడం ద్వారా ప్రియాంకనే నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిపింది.

శనివారం ప్రియాంక పర్యటన వివాదాస్పదమైన నేపథ్యంలో ఈమేరకు ప్రకటన విడుదల చేసింది సీఆర్​పీఎఫ్​.

"ఎలాంటి భద్రత అధికారి లేకుండా బుల్లెట్​ప్రూఫ్ లేని వాహనంలో ప్రయాణించారు. స్కూటీపై వెనుక ఎక్కి కూర్చున్నారు. ఇలాంటి భద్రతా లోపాలను వారికి తెలియజేశాం. ముందుగానే భద్రతాపరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించాం."
-సీఆర్​పీఎఫ్

గతంలో ప్రియాంకకు జడ్​ ప్లస్​ కేటగిరీ భద్రత ఉండేది. ఇటీవల జరిగిన మార్పులతో ఆమెకు సీఆర్​పీఎఫ్ భద్రత కల్పిస్తోంది.

ప్రియాంక స్కూటీ ప్రయాణం

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేసి అరెస్టయిన మాజీ ఐఏఎస్ అధికారి కుటుంబాన్ని కలవడానికి డిసెంబర్ 28న ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూకు వచ్చారు ప్రియాంక గాంధీ. పోలీసులు అడ్డుకోవడం వల్ల ఓ సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్త స్కూటీపై ప్రయాణించారు. నిర్లక్ష్య డ్రైవింగ్ సహా హెల్మెట్ ధరించనందుకు ఈ స్కూటీ యాజమానికి పోలీసులు జరిమానా విధించారు.

ఇదీ చదవండి: 'భూత్ బంగ్లా' బురారీ హౌస్​లోకి కొత్త కుటుంబం

ABOUT THE AUTHOR

...view details