తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వినూత్నం: పుష్పగుచ్చాలు వద్దు-పుస్తకాలే ముద్దు..!

ప్రజాప్రతినిధిగా గెలిచి వినూత్నంగా సంబరాలను జరుపుకొని పలువురి మన్ననలు పొందారు కేరళలోని ఎమ్మెల్యే. విజయోత్సవ ర్యాలీలో పుస్తకాలను సేకరించి వాటిని పాఠశాల గ్రంథాలయాలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఆయన ఆలోచన స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.

By

Published : Nov 22, 2019, 6:32 AM IST

ఎమ్మెల్యే పుస్తక సేకరణ

విజయోత్సవ ర్యాలీలో పుస్తకాలను సేకరించిన ఎమ్మెల్యే

పుస్తక విరాళానికి సంబంధించి ఎమ్మెల్యే వినూత్న ఆలోచనకు విశేష స్పందన లభించింది. శుభాకాంక్షలు తెలిపేందుకు పుష్పగుచ్ఛానికి బదులుగా ఒక పుస్తకాన్ని బహుమతి ఇవ్వాలన్న ఆయన విజ్ఞప్తి చాలా మందిని ఆకర్షించింది. సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్​గా మారారు.

కేరళలోని వట్టివుర్​కావు ఎమ్మెల్యే వీకే ప్రశాంత్. స్థానికులు 'మేయర్​ బ్రో' అని పిలుచుకుంటారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. అయితే శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే వారు పుష్పగుచ్ఛం బదులుగా ఏదైనా పుస్తకాన్ని ఇవ్వాలని ఆయన కోరారు.

3 రోజుల పర్యటన

ఈ ప్రకటనకు విశేష స్పందన లభించింది. చాలా మంది పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. గెలుపు అనంతరం 3 రోజులపాటు నియోజకవర్గంలో పర్యటించారు ప్రశాంత్. ఈ సమయంలో దాదాపు 3,300 పుస్తకాలను సేకరించారు.

విరాళంగా...

ఈ పుస్తకాలను ప్రస్తుతం శాస్తమంగళంలోని ఎమ్మెల్యే అధికారిక కార్యాలయంలో పెట్టారు. వీటిని పాఠశాల గ్రంథాలయాలకు విరాళంగా ఇవ్వాలని ఆయన నిర్ణయించారు.

ఇదీ చూడండి: కేంద్రప్రభుత్వంలో 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశం

ABOUT THE AUTHOR

...view details