ఎన్నికల్లో రోడ్ షోలు, బైక్ ర్యాలీలు... వాయు, శబ్ద కాలుష్యాలకు కారణమవుతున్నాయని ఉత్తర్‌ప్రదేశ్ డీజీపీ, వాతావరణ అధికారులు సుప్రీంలో వ్యాజ్యం వేశారు. రాజకీయ నేతల ప్రచారాలు ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్నాయని, ప్రజాజీవనానికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అందువల్ల నేతల రోడ్‌షోలు, బైక్ ర్యాలీలపై నిషేధం విధించాల్సిందిగా ఎన్నికల సంఘానికి ఆదేశించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
"రోడ్‌షోలు, బైక్ర్యాలీలపై నిషేధం లేదు"
ఎన్నికల ప్రచారాల్లో రోడ్‌షోలను, బైక్ ర్యాలీలను నిషేధించాలన్న వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించేది లేదని స్పష్టం చేసింది.
రోడ్‌షోలు, బైక్ర్యాలీలపై నిషేధం లేదు
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రోడ్ షోలో పాల్గొనే వాహనాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఒక కాన్వాయ్కి 10కి మించి చక్రాలు ఉండకూడదని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈసీ నిబంధనలను ఏ రాజకీయ పార్టీ పాటించడం లేదని వ్యాజ్యంలో పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం వ్యాజ్యాన్ని కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది.
Last Updated : Mar 25, 2019, 11:19 PM IST