మహిళలపై పెరుగుతున్న లైంగిక నేరాలకు అశ్లీల సైట్లే కారణమని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వెబ్సైట్లను తక్షణమే నిషేధించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న అన్ని అశ్లీల సైట్లను, అనుచిత కంటెంట్‌ని తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
" ఆడపిల్లలు, మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. అలాంటి వాటిని చూడటం వల్ల పిల్లలు, యువకుల ఆలోచనలు పాడవుతున్నాయి. మహిళలపై నేరాల రేటు పెరగడానికి ఇవే కారణం.త్వరగా వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను."
- బిహార్ సీఎం నితీశ్ కుమార్ లేఖ