తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​ బరి: వర్చువల్​ ర్యాలీలతో నితీశ్​ ప్రచార బాట

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల జోరు మొదలైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్​ కుమార్​ వర్చువల్​ ర్యాలీలతో ప్రచార బాట పట్టనున్నారు. ఈనెల 12, 13 తేదీల్లో ఆరు జిల్లాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గలో వర్చువల్​ ర్యాలీ నిర్వహించనున్నారని, ఆ తర్వాత నేరుగా ఎన్నికల సభల్లో పాల్గొంటారని పార్టీ నేతలు తెలిపారు.

Nitish to hit campaign trail in Bihar
నితీశ్​ కుమార్​

By

Published : Oct 12, 2020, 5:30 AM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో అధికార, విపక్ష పార్టీలు ప్రచార జోరును పెంచుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్​ కుమార్​.. వర్చువల్​ ర్యాలీలతో నేటి నుంచి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తొలివిడత ఎన్నికలు జరగనున్న ఆరు జిల్లాల పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వర్చువల్​ ర్యాలీలు నిర్వహించనున్నారని అధికార పార్టీ నేతలు తెలిపారు.

" రానున్న రోజుల్లో నితీశ్​కుమార్​ 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార ర్యాలీలు నిర్వహించనున్నారు. అక్టోబర్​ 12, 13 తేదీల్లో వర్చువల్​ ర్యాలీల్లో పాల్గొంటారు. అక్టోబర్​ 14 నుంచి వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఎన్నికల సమావేశాలకు నేరుగా హాజరుకానున్నారు. వర్చువల్​ ర్యాలీ సోమవారం సాయంత్రం ప్రారంభం కానుంది. ఆరు జిల్లాల్లోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలతో మాట్లాడనున్నారు. మంగళవారం రోజు ఉదయం ఐదు జిల్లాల్లోని 11, సాయంత్రం 4 జిల్లాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలతో వర్చువల్​గా భేటీ కానున్నారు. "

- సంజయ్​ కుమార్​ ఝా, జేడీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి.

రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచార కార్యక్రమాన్ని భాజపా ఖరారు చేసినట్లు తెలిపారు సంజయ్​. వాటిపై పూర్తిస్థాయిలో సమాచారం లేకపోయినా.. పలు సందర్భాల్లో ప్రధాని, ముఖ్యమంత్రి ఒకే వేదికను పంచుకోనున్నారని వెల్లడించారు.

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి నితీశ్​ కుమార్​ కోసం ఓట్లు వేయమని ప్రధాని ప్రజలను కోరనున్నారు. 2017లోఎన్డీఏ కూటమిలో జేడీయూ చేరిన క్రమంలో పలు సందర్భాల్లో ఇరువురు నేతలు ఒకే వేదికను పంచుకున్నారు. గత లోక్​సభ ఎన్నికల్లోనూ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్న సందర్భాలు కనిపించాయి.

ఇదీ చూడండి: బిహార్​ బరి: 30 'స్టార్స్​'​తో భాజపా ప్రచారం

ABOUT THE AUTHOR

...view details