తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బిహార్ ఎన్డీఏ కూటమిలో అంతా సవ్యంగా ఉంది' - sushil kumar modi latest news

బిహార్​ ఎన్డీఏ కూటమిలో పాలన అంతా బాగుందని ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ తెలిపారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకు ఎక్కువ సీట్ల కేటాయింపు విషయంలో చెలరేగిన వివాదంపై నితీశ్​ స్పందించారు.

Nitish says "all is well" even as PK launches a frontal attack
'బిహార్ ఎన్డీఏ కూటమిలో పరిస్థితులు బాగానే ఉన్నాయి'

By

Published : Dec 31, 2019, 11:48 PM IST

బిహార్​లో భాజపా, జేడీయూ కూటమిలో పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయని ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ ఉద్ఘాటించారు. ఇటీవల జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్​ కిశోర్​.. భాజపా నాయకుడు, ఉప ముఖ్యమంత్రి సుశీల్​ కుమార్​ మోదీల మధ్య చెలరేగిన వాగ్వివాదం.. రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది బిహార్​లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకు ఎక్కువ సీట్లు కేటాయించాలనే అంశంపై ఈ వివాదం మొదలైంది.

భాజపా నాయకుడు నవీన్​ కిశోర్​ ప్రసాద్​ సిన్హా మృతికి సంతాపం తెలిపిన నితీశ్​.. ఈ సందర్భంగా ఎన్డీయేలో అంతా బాగుందని స్పష్టం చేశారు.

వివాదం మొదలైందిలా

ఇటీవల ఓ మీడియా సమావేశంలో బిహార్​లో రాబోయే ఎన్నికల్లో భాజపా కన్నా జేడీయూ అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తుందని కిశోర్​ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిసున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి సుశీల్​ కుమార్​ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ నేతృత్వంలో 2020 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతామని ఆయన అన్నారు. సీట్ల పంపకాల్లో ఇరు పార్టీలు సకాలంలో నిర్ణయించుకుంటాయని వెల్లడించారు. పౌరసత్వ చట్టంపై కిశోర్​ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు.

చట్టానికి వ్యతిరేకంగా వస్తోన్న నినాదాలు వింటే అసంతృప్తిగా ఉంది. రాజకీయాల్లోకి ఓ సిద్ధాంతంతో కాకుండా వ్యాపార దృక్పథంతో వచ్చి.. వ్యతిరేక నినాదాలతో ప్రజల దారిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

సుశీల్​ కుమార్​ మోదీ, బిహార్​ ఉప ముఖ్యమంత్రి

ఈ వ్యాఖ్యలపై కిశోర్​ ఘాటుగా స్పందించారు. నితీశ్​ కుమార్​ లాంటి గొప్ప నాయకత్వంలో జేడీయూ పార్టీ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిందన్నారు. ఉప ముఖ్యమంత్రి సుశీల్​​ కుమార్​ రాజకీయాలపై ఉపన్యాసాలిస్తుంటే వినటానికి ఆహ్లాదంగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ABOUT THE AUTHOR

...view details