బిహార్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సీఎం నితీశ్ కుమార్.. ఆర్జేడీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదటి కేబినెట్ భేటీలోనే 10 లక్షల ఉద్యోగాలను ఆమోదిస్తామన్న హామీపై ఎగతాళి చేశారు.
వర్చువల్గా 11 నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన నితీశ్.. ఆర్జేడీ పేరు వాడకుండా విపక్షాలంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా 2005 నుంచి తమ ప్రభుత్వం సాధించిన విజయాలను నితీశ్ ప్రస్తావించారు.