తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​ బరి: ప్రజలపై నితీశ్​ హామీల వర్షం - నితీశ్​ జేడీయూ

'7 నిశ్చయ్​ పార్ట్​-2'తో మరోమారు బిహార్​ ప్రజల ముందుకు వచ్చారు ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. ఉద్యోగాల పొందేందుకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం నుంచి మహిళలు ఆర్థికంగా ఆదుకునే విషయం వరకు పలు వాగ్దానాలు చేశారు. వీటితో రాష్ట్రం స్వావలంబన వైపు అడుగులు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Nitish Kumar announces JDU's '7 Nischay part-2' for development
బిహార్​ బరి: ప్రజలపై నితీశ్​ 'హామీల' వర్షం

By

Published : Oct 11, 2020, 4:46 PM IST

బిహార్​ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను ఆకర్షించేందుకు వివిధ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్నికల సమరానికి తగ్గట్టుగానే అధికార జేడీయూ కూడా ప్రజలపై హమీల వర్షం కురిపిస్తోంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​.. ఇప్పటికే 7 తీర్మానాలను ప్రజల ముందు ప్రవేశపెట్టారు. తాజాగా.. '7 నిశ్చయ్​ పార్ట్​-2' పేరుతో మరో ట్వీట్​ చేశారు.

బిహార్ ప్రజలకు సేవ చేయడమే తన ధర్మమని పేర్కొన్నారు నితీశ్​. ప్రజల ఆశీస్సులతో.. తన హామీలను నెరవేర్చగలుగుతానని.. తద్వారా బిహార్​ రాష్ట్రం స్వావలంబన వైపు అడుగులు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

నితీశ్​ హామీలు..

  • ఐటీఐ, పాలిటెక్నిక్​ సంస్థల్లో నైపుణ్య శిక్షణను అందించేందుకు ఓ కేంద్రాన్ని ఏర్పాటు. ఉద్యోగాలు పొందే విధంగా శిక్షణ అందించేందుకు జిల్లా స్థాయిలో 'మెగా స్కిల్​ సెంటర్​' నిర్మాణం.
  • కొత్త వ్యాపారాలను ప్రోత్సహించేందుకు రూ. 3లక్షల వరకు 50శాతం గ్రాంట్లు అందజేత. రూ. 7లక్షల రుణాలకు 7శాతం గ్రాంట్లు మంజూరు. ప్రాజెక్టు వ్యయంలో 50శాతం లేదా రూ. 5లక్షల గ్రాంట్లు, రూ. 5లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేత.
  • నారీ శక్తిని పెంపొందించేందుకు.. 12వ తరగతి ఉత్తీర్ణులయ్యే వారికి రూ. 25వేలు, డిగ్రీ పాస్​ అయ్యేవారికి రూ. 50వేల ఆర్థిక సహాయం అందివ్వడం.
  • స్థానిక పాలన, పోలీసు, జిల్లా స్థాయి కార్యాలయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంపొందించేందుకు చర్యలు.
  • పంట పొలాల్లోకి నీరు పంపించేందుకు అన్ని విధాలుగా రైతులకు సహాయం. సౌర దీపాలు, ఘన-ద్రవ వ్యర్థాల నిర్వహణ కోసం ప్లాంట్లు, ప్రతి ఇంటికీ నీటి కుళాయి, మరుగుదొడ్లు నిర్మాణం.
  • రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించడం కోసం నగరాలు, ఇతర ప్రదేశాల్లో రోడ్ల నిర్మాణం. ప్రజారోగ్య వ్యవస్థ మెరుగుదలకు చర్యలు.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details