తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రులు

ఆర్థిక, కార్పొరేట్​ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​. రాష్ట్రపతి భవన్​లో గురువారం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె​ మోదీ కేబినేట్​లో రెండోసారి చోటు దక్కించుకున్నారు. గత ప్రభుత్వంలో రక్షణ శాఖ బాధ్యతలు నిర్వహించారు నిర్మల. పలువురు కేంద్ర మంత్రులూ బాధ్యతలు స్వీకరించారు.

By

Published : May 31, 2019, 5:06 PM IST

బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రులు

బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రులు

ప్రధామంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చోటు దక్కిన కేంద్ర మంత్రులు తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు స్వీకరించారు. కీలకమైన ఆర్థిక, కార్పొరేట్​ వ్యవహారాల శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్​ బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో రక్షణ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన ఆమె​ రెండోసారి కేంద్రమంత్రి పదవిని అలంకరించారు.

రైల్వే మంత్రిగా మళ్లీ..

గతంలో రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పియూష్​ గోయల్​కు తిరిగి అదే శాఖ దక్కింది. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు ఆ బాధ్యతలను నిర్వర్తించిన సురేష్​ ప్రభు ఆయనకు స్వాగతం పలికారు.

జల్​శక్తి మంత్రిగా గజేంద్ర సింగ్

నీటివనరులు, ఇతర పలు శాఖల మేళవింపుతో కొత్తగా ఏర్పాటు చేసిన జల్​శక్తి శాఖ మంత్రిగా గజేంద్ర సింగ్​ షెఖావత్​ బాధ్యతలు చేపట్టారు. దిల్లీలోని శ్రమ శక్తి భవనంలో బాధ్యతలు స్వీకరించారు.

చమురు, సహజ వాయువు మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్​

పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్​ బాధ్యతలు స్వీకరించారు. ఉక్కు మంత్రిత్వ శాఖ మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు.

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్​

గతంలో విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి అనూహ్యంగా కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న సుబ్రమణ్యం జైశంకర్​ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

మైనార్టీ వ్యవహారాల శాఖ

మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ బాధ్యతలు చేపట్టారు. దిల్లీలోని అధికారిక భవనంలో బాధ్యతలు స్వీకరించారు.

సమాచార, ప్రసారాల శాఖ

సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా ప్రకాశ్​ జావడేకర్​ బాధ్యతలు స్వీకరించారు.

మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా..

మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా రమేశ్​ పోఖ్రియాల్​ నిషాంక్​ బాధ్యతలు స్వీకరించారు.

పౌర సరఫరా శాఖ మంత్రిగా...

వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రామ్​ విలాస్​ పాసవాన్​.

ఇదీ చూడండి:మిత్​షాకు హోం... రాజ్​నాథ్​కు రక్షణ శాఖ

ABOUT THE AUTHOR

...view details