తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశంలో ఆర్థిక మాంద్యం లేదు.. ఉండబోదు'

దేశంలో ప్రస్తుతం ఆర్థిక మాద్యం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను అందుకునేందుకు 32 చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

Nirmala Sitharaman says no recession in Indian economy
కేవలం మందగమన పరిస్థితులే, మాంద్యం లేదు..ఉండబోదు

By

Published : Nov 27, 2019, 10:55 PM IST

Updated : Nov 27, 2019, 11:13 PM IST

దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నాయి తప్ప ఆర్థిక మాంద్యం పరిస్థితులు లేనేలేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా యూపీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వం మధ్య వ్యత్యాసం గురించి లెక్కలతో సహా వివరించారు.

2009-14 యూపీఏ-2 హయాంలో 189.5 బిలియన్‌ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే అదే భాజపా హయాంలో ఆ సంఖ్య 284.9 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని చెప్పారు. అదే సమయంలో విదేశీ మారక నిల్వలు సైతం 304.2 బిలియన్‌ డాలర్ల నుంచి 412.6 బిలియన్‌ డాలర్లకు పెరిగినట్లు వివరించారు నిర్మలా.

" దేశంలో ఆర్థిక మందగనం పరిస్థితులే ఉన్నాయి తప్ప.. ఎలాంటి మాంద్యం లేదు.. ఉండబోదు. సంక్షోభంలో ఉన్న బ్యాంకింగ్‌ రంగానికి ఊతమిచ్చేందుకు అనేక చర్యలు చేపట్టాం. అలాగే 5 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థను అందుకునేందుకు 32 చర్యలు తీసుకున్నాం." - నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి

Last Updated : Nov 27, 2019, 11:13 PM IST

ABOUT THE AUTHOR

...view details