తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆరోపణలపై రాహుల్​ క్షమాపణ చెప్పాలి'

రఫేల్​ వ్యవహారంలో రాహుల్​ గాంధీ సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రాన్ని విమర్శనాస్త్రంగా మలుచుకుంది భాజపా. కాంగ్రెస్ అధ్యక్షుడు అసత్యాలపై ఆధారపడుతున్నట్లు స్పష్టమైందని దుయ్యబట్టింది.

By

Published : Apr 22, 2019, 5:08 PM IST

"రాహుల్ విశ్వసనీయత కోల్పోయారు"

రఫేల్​ వ్యవహారంలో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భాజపా డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టులో సమర్పించిన ప్రమాణపత్రం ద్వారా ప్రధానిపై, రఫేల్​ ఒప్పందంపై అసత్య ఆరోపణలు చేసినట్లు రాహుల్​ అంగీకరించారని కమలదళం విమర్శించింది.

"రాహుల్ విశ్వసనీయత కోల్పోయారు"

"రాహుల్ గాంధీ విశ్వసనీయత ఇప్పటికే దెబ్బతింటోంది. ఆయన విశ్వనీయత కోల్పోతున్నారు. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులు అసత్యం మాట్లాడటం, ఆపైన విచారం వ్యక్తం చేయటం అలవాటుగా మారింది. కాంగ్రెస్ లాంటి ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడైన రాహుల్​ గాంధీ అబద్ధాలపై ఆధారపడటం శోచనీయం."

- నిర్మలా సీతారామన్​, రక్షణమంత్రి

ఇదీ చూడండి: 'ఉగ్రవాదం పట్ల వైఖరిలో మార్పు సుస్పష్టం'

ABOUT THE AUTHOR

...view details